మాఘ స్నాన ఫలితం

కార్తిక మాసంలో దీపారాధన చేయడం వలన ఎంతటి విశేషమైన ఫలితం లభిస్తుందో, మాఘమాసంలో చేసే నదీ స్నానం వలన అంతటి విశేషమైన ఫలితమే లభిస్తుందనేది మహర్షుల మాట. అందువల్లనే మాఘమాసంలో నదీ స్నానానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో తెల్లవారు జామునే నిద్రలేచి నదీ స్నానం చేయాలి. అందుకు అవకాశం లేకపోతే నదులను తలచుకుంటూ బావి నీటితో స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది.

 ఆ తరువాత  వైష్ణవ ఆలయాలను దర్శించి స్వామివారికి పూజలు చేయించడం వలన పుణ్యరాశి పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మాఘ ఆదివారాలు మహా విశేషమైనవి. ఈ రోజులలో చేసే సూర్య నమస్కారాల వలన .. ఆరాధనలు వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ మాసంలో శివాలయాలకు వెళ్లి అక్కడ 'నువ్వుల నూనె'తో దీపారాధన చేయడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి .. సకల శుభాలు చేకూరతాయనేది శాస్త్ర వచనం. 


More Bhakti News