పరశురాముడి సంకల్పం చేత వెలసిన శివలింగం

కామధేనువు కోసం 'జమదగ్ని' మహర్షిని 'కార్తవీర్యార్జునుడు' హతమారుస్తాడు. తన తండ్రి మరణానికి కారకులైన క్షత్రియులపై ఆగ్రహంతో 'పరశురాముడు' వాళ్లని సంహరిస్తూ వెళతాడు. ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి 108 శివలింగాలను ప్రతిష్ఠించమని మహర్షులు సూచిస్తారు. దాంతో అనేక ప్రదేశాల్లో పరశురాముడు శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళతాడు. అయితే ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించడానికి ఆయన శివలింగం కోసం వెళ్లగా, ఆయన సంకల్పానికి మెచ్చిన శివుడే లింగ రూపంలో ఆ ప్రదేశంలో ఆవిర్భవించాడు. అదే నేడు 'సిద్ధేశ్వర క్షేత్రం'గా ప్రసిద్ధి చెందింది.

గుంటూరు జిల్లా.. దుర్గి మండలం .. 'తేరాల' గ్రామం సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. శివుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించడం చూసి పరశురాముడు పరమానందభరితుడవుతాడు. తాను తెచ్చిన శివలింగాన్ని .. స్వయంభువు లింగానికి వెనుక ప్రతిష్ఠిస్తాడు. అలా ఒకే గర్భాలయంలో రెండు శివలింగాలు దర్శనమిస్తూ .. భక్తులకి  అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 


More Bhakti News