వ్యాధులను నివారించే 'శివగంగ'

తమిళనాడులోని ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో 'చిదంబరం' ఒకటి. తంజావూరుకి సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి మూలవిరాట్టుగా 'నటరాజస్వామి' దర్శనమిస్తుంటాడు. ఇక్కడి ఆలయంలో గల ఒక తెరను తొలగించి .. ఆకాశలింగ రూపంలో అక్కడ శివుడు కొలువై వున్నాడని అర్చక స్వాములు చెబుతారు. ఆకాశమంటే శూన్యమే గనుక అక్కడ స్వామివారు ఒక రూపంతో కనిపించరు.

ఈ క్షేత్రంలో చేసే 'శివగంగ' స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. 'శివగంగ'లో స్నానం చేసినవారు .. వివిధ రకాల వ్యాధుల బారి నుంచి బయటపడతారని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. పూర్వం శ్వేతవర్మ అనే ఒకరాజు చిత్రమైనటువంటి ఒక వ్యాధితో నానాబాధలు పడుతూ ఉండేవాడట. ఒక మహర్షి సూచన మేరకు ఇక్కడి 'శివగంగ'లో స్నానం చేసిన ఆయన, ఆ వ్యాధి నుంచి విముక్తిని పొందాడనే కథనం ఒకటి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అందువలన భక్తులు శివగంగ స్నానం తప్పకుండా చేస్తుంటారు. 


More Bhakti News