లవకుశుల పాద చిహ్నాలు ఈ క్షేత్రంలో చూడవచ్చు

పరమశివుడు లింగ రూపంలోనే తన భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఆయన మూర్తి రూపంగా దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా తక్కువ. ఇక విష్ణుమూర్తి మాదిరిగా శయన భంగిమలో దర్శనమిచ్చే క్షేత్రం మాత్రం ఒక్కటే వుంది .. అదే 'పళ్లికొండేశ్వర స్వామి' క్షేత్రం. మహిమాన్వితమైన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా 'సురుటుపల్లి'లో వెలుగొందుతోంది. క్షీరసాగర మథన సమయంలో వెలువడిన హాలాహలాన్ని లోక కల్యాణం కోసం మింగిన శివుడు, ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో కాసేపు విశ్రమించాడు. అందువల్లనే స్వామి శయన భంగిమలో కనిపిస్తాడు.

ఈ క్షేత్రంలోనే 'రామలింగేశ్వర స్వామి' పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. స్వామి దర్శనం కోసం సీతారాములు .. హనుమ .. లక్ష్మణ .. భరత .. శత్రుఘ్నులు .. లవకుశులు ఈ క్షేత్రానికి వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన కారణంగానే స్వామివారిని రామలింగేశ్వరుడుగా కొలుస్తుంటారు. ఇక్కడే చిన్న చిన్న పాద ముద్రలు కూడా కనిపిస్తాయి. అవి లవకుశులవని స్థానికులు చెబుతుంటారు. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపలు .. దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తూ వుంటారు.           


More Bhakti News