కార్తిక మాసంలో తులసి పూజా ఫలితం

తులసి మొక్క ఎంతో విశేషమైనది .. పూజనీయమైనది .. మహిమాన్వితమైనది. తులసి యొక్క విశేషాన్ని గురించి పురాణాలలో సైతం చెప్పబడింది. తులసి ఆకు మధ్యలో విష్ణువు ... చివరలో బ్రహ్మదేవుడు .. తొడిమలో శివుడు వుంటారు. లక్ష్మీదేవి .. సరస్వతీదేవి .. గాయత్రితోపాటు సర్వదేవతలు తులసి ఆకులో కొలువై వుంటారు. సమస్త పుణ్య తీర్థాలు తులసిని ఆశ్రయించి వుంటాయనేది మహర్షుల మాట. అలాంటి తులసి దళాలను స్నానం చేయకుండా కోయకూడదు.

అలాగే ఆది .. మంగళ .. గురు .. శుక్రవారాల్లో కోటలోని తులసి దళాలను కోయకూడదు. తులసి ఆకులను విడివిడిగా కాకుండా దళాలుగా కోయాలి. బొటనవ్రేలు .. మధ్య వ్రేలు .. ఉంగరపు వ్రేలును కలిపి తులసిని కోయవలసి ఉంటుంది. తులసి విష్ణు భక్తురాలు కనుక, పూజలో తులసిని స్వామివారి పాదాల చెంత సమర్పించాలే గానీ, ఆయన శిరస్సుపై ఉంచకూడదు. కార్తిక మాసంలో తులసిని పూజించడం వలన .. తులసి కోటలో దీపం పెట్టడం వలన .. శ్రీమన్నారాయణుడికి తులసి సమర్పించడం వలన .. తులసి మాల ధరించడం వలన సమస్త దోషాలు నశించి, సకలశుభాలు చేకూరతాయి.     


More Bhakti News