ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయాలనిచ్చే వేంకటేశ్వరుడు

Fri, Nov 15, 2013, 12:08 PM
Related Image కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడికి సమానమైన దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి. తాను ఎక్కడ వుంటే అక్కడ కొండలు ... కోనేళ్లు ఉండేలా చూసుకునే వేంకటేశ్వరస్వామి, అనుక్షణం భక్తులకు అండదండగా ఉంటూ వుంటాడు. ఈ నేపథ్యంలో స్వామి అనేక ప్రాంతాల్లో స్వయంభువుగా ఆవిర్భవించాడు. అలాంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో 'మల్దకల్' ఒకటిగా కనిపిస్తుంది.

మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ క్షేత్రం శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతోంది. ఇక ఇక్కడ స్వామి అభయ హస్తం ... సుదర్శన చక్రం మాత్రమే కాకుండా, కత్తీ... డాలు పట్టుకుని కనిపించడాన్ని విశేషంగా చెబుతారు. స్వామి ఈ విధంగా ఆయుధాలతో దర్శనమిస్తూ వుండటం వలన భక్తులు ఆయనను శత్రు సంహార వేంకటేశ్వరుడుగా కొలుస్తుంటారు. ఈ స్వామిని పూజించడం వలన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని చెబుతారు.

స్వామి ఇక్కడ కొలువుదీరిన విధానాన్ని పరిశీలిస్తే, పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకి ఈ ప్రదేశం తరచూ కలలో కనిపిస్తూ ఉండేదట. దాంతో రాజు ఈ ప్రదేశాన్ని వెదుక్కుంటూ వచ్చి, అక్కడ స్వయంభువుగా వున్న వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూశాడు. స్వామివారి ఆదేశాన్ని అర్ధం చేసుకున్న ఆ రాజు, అదే ప్రదేశంలో ఆయనకి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ప్రదేశాన్ని ... ఈ విగ్రహాన్ని కనుక్కోవడంలో తనకి సహకరించిన వ్యక్తినే ఆయన అర్చకుడిగా నియమించాడు.

సహజ సిద్ధంగా ఇక్కడ ఏర్పడిన కోనేరులో భక్తులు స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుంటూ వుంటారు. ప్రతియేటా స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా జరిగే వాహన సేవల సందడినీ ... ఆ వైభవాన్ని చూసితీరవలసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.87.3