ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేదారేశ్వర క్షేత్రం

Sat, Nov 09, 2013, 10:42 AM
Related Image పరమశివుడు దయామయుడు ... శరణు కోరిన వారిని శరము కంటే వేగంగా చేరుకొని కాపాడే కరుణామయుడు. చల్లని మనసున్న ఆ స్వామికి కార్తీకమాసం అంటే ఎంతో ఇష్టం. ఈ కారణంగానే ఈ మాసంలో ఆయనకి సంబంధించిన క్షేత్రాలన్నీ భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా 'తాటికొండ'వెలుగొందుతోంది.

గుంటూరు జిల్లాలోని ఈ క్షేత్రంలో సదాశివుడు తొమ్మిది లింగరూపాల్లో ... తొమ్మిది పేర్లతో అలరారుతుంటాడు. ఈ తొమ్మిది రూపాల్లో కేదారేశ్వర స్వామిని ప్రధాన దైవంగా భక్తులు భావిస్తుంటారు. నవవిధ భక్తి మార్గాలకు సంకేతంగా కనిపించే ఈ ఆలయం నాటి ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది.

ఇక్కడి స్థల మహాత్మ్యం గురించి తెలుసుకున్న ఆదిశంకరుల వారు, ఈ క్షేత్ర దర్శనం చేసుకున్నట్టుగా ఆధారాలు వున్నాయి. ఇక ఎంతో మంది యోగులు తమ తపో సాధనకు ఈ ప్రదేశం అనుకూలమైనదిగా భావించి ఇక్కడే వుండేవారు. ఇక ఈ స్వామివారిని ఎందరో రాజ వంశీకులు తమ ఇలవేల్పుగా భావించి పూజించారు. ఈ స్వామి అనుగ్రహం కారణంగానే తాము అనేక యుద్ధాల్లో విజయాలు సాధించినట్టు నాటి రాజులు విశ్వసించేవారు. ఈ కారణంగానే యుద్ధానికి ముందు ఆ తరువాత స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించేవారు.

పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో రెండు కోనేర్లు దర్శనమిస్తూ వుంటాయి. ఈ కోనేటి నీటిని తలపై చల్లుకున్నంత మాత్రానే సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఇక్కడి కేదారేశ్వరుడిని దర్శించుకోవడం వలన కేదారేశ్వరస్వామి వ్రతం చేసుకున్నంత ఫలితం లభిస్తుందని అంటారు. అందువలన కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62