ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆంజనేయుడి ఆవాసం కొండగట్టు

Thu, Jun 06, 2013, 03:32 PM
Related Image ఆంధ్రదేశంలో 'కొండగట్టు ఆంజనేయస్వామి'కి ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నాయి. కరీంనగర్ జిల్లాలో వెలసిన ఈ ఆంజనేయస్వామి మహాశక్తిమంతుడనీ ... దుష్టగ్రహ పీడలనుంచి విముక్తి కలిగించడమే కాకుండా, కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగానే గుట్టలు ... గుహలు ... అనేక వృక్ష జాతులను కలిగివున్న ఈ ప్రాంతానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
రావణ సంహార సమయంలో లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని తీసుకు వెళుతుండగా, అందులోని కొంతభాగం ఈ ప్రదేశంలో పడి 'కొండగట్టు'గా మారిందని చెబుతుంటారు. ఆ తరువాత కాలంలో ఆంజనేయుడు ఇక్కడ వెలిశాడని అంటుంటారు. కాలక్రమంలో మరుగున పడిపోయిన ఈ విగ్రహం తిరిగి వెలుగు చూడటం గురించి, ఇక్కడి స్థలపురాణం వివరిస్తోంది.

చాలాకాలం క్రితం ఓ యాదవుడు ఈ ప్రదేశంలో పశువులను మేపడానికి వచ్చాడు. మందలో నుంచి ఒక ఆవు తప్పిపోవడంతో దానిని వెదకసాగాడు. ఆ ప్రయత్నంలో అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రమించగా, అప్పుడు అతని కలలో ఆంజనేయస్వామి కనిపించి ఆవు జాడ చెప్పాడు. అంతే కాకుండా తాను ఫలానా పొదలో ఉన్నాననీ ... తనని అక్కడి నుంచి వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పాడు.

ఆ యాదవుడు ఆ ప్రకారం స్వామివారి విగ్రహాన్ని బయటికి తీశాడు. ఓ వైపు నృసింహస్వామి ... మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం ... శంఖు చక్రాలు .... హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఇది సంజీవిని పర్వతంలోని ఓ భాగంగా చెప్పుకుంటున్నందు వలన, ఆయురారోగ్యాలను ఆశిస్తూ భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205