ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అన్నపూర్ణాదేవి క్షేత్రం

Thu, Oct 17, 2013, 10:57 PM
Related Image ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా ... సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. అన్నపానియాల విషయంలో తమకి ఎలాంటి లోటూ రానీయవద్దని ప్రార్ధనలు చేస్తారు. ఆలయం ఏదైనా ... దైవం ఏదైనా ఈ రకమైన అభ్యర్థనలు అన్నపూర్ణాదేవినే చేరుతుంటాయి. ఎందుకంటే సమస్త జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే తల్లి ఆమె.

అలాంటి అన్నపూర్ణాదేవి ఆలయానికే వెళితే అక్కడ లభించే ప్రశాంతత ... ఆ తల్లి అనుగ్రహం వలన కలిగే భద్రత అంతా ఇంతా కాదు. ఆ చల్లని తల్లి ఆవిర్భవించిన క్షేత్రం కర్ణాటక - హొరనాడులో కనిపిస్తుంది. కాశీ తరువాత అన్నపూర్ణాదేవి అవతరించిన క్షేత్రంగా ఇది విశిష్టతను సంతరించుకుంది.

ప్రాచీనకాలం నాటి ఈ ఆలయం, నిర్మాణపరంగా వైభవాన్ని చాటుతూ వుంటుంది. కేరళా సంప్రదాయ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం, ప్రశాంతతకు ప్రతీకగా దర్శనమిస్తూ వుంటుంది. గర్భాలయంలోని అమ్మవారిని అగస్త్యమహర్షి ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. గర్భాలయంలో అమ్మవారు చక్కని కనుముక్కుతీరుతో ... స్వర్ణ కవచంతో నయనానందాన్ని కలిగిస్తూ వుంటుంది.

అంతరాళంలో ఒకవైపు మహానైవేద్యాలు ... మరో వైపున వేలదీపాలు వుంటాయి. ఆ దీప కాంతుల్లో అమ్మవారు కళకళలాడుతూ వుంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలవారు తొలిపంటను అమ్మవారికి సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. ఇక కోరికలు నెరవేరిన వాళ్లు తులాభారం తూగి మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రాన్ని దర్శించడం, ఆకలితీర్చే తల్లి ఆప్యాయతను మూటగట్టుకోవడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
X

Feedback Form

Your IP address: 54.197.72.5