ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాడపల్లి

Tue, Oct 15, 2013, 06:25 PM
Related Image పురాణపరమైన ... చారిత్రక పరమైన నేపథ్యం గల క్షేత్రాలలో 'వాడపల్లి' క్షేత్రం ఒకటి. శివకేశవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడా చేరువలో కృష్ణా నదీ తీరంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. వేల సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం వైభవంగా వెలుగొందుతోంది.

పూర్వం అగస్త్యమహర్షి శివకేశవుల ప్రతిమలను 'కావడి'లో తీసుకుని వెళుతూ వుండగా, ఈ ప్రదేశానికి రాగానే సంధ్యా సమయమైంది. దాంతో ఆయన ఆ 'కావడి'ని అక్కడ వుంచి సంధ్యా వందనం చేసుకుని తిరిగి వచ్చాడు. కానీ కావడి ఎంత మాత్రం అక్కడి నుంచి కదలలేదు. కారణమేదో వుందని గ్రహించిన ఆయన శివకేశవులను ప్రార్ధించాడు. ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనదనీ ... ఇక్కడే తాము కొలువై ఉంటామని శివకేశవులు చెప్పారు.

హరిహరుల మనసు తెలుసుకున్న అగస్త్యుడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామినీ, శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఇక్కడి శివుడు అగస్త్య లింగేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. అగస్త్య మహర్షితో పాటు ఎంతోమంది మహర్షులు ... మునులు ... శివకేశవులను ఆరాధించి తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. కాలక్రమంలో ఈ క్షేత్రం మట్టి పుట్టలతో కప్పబడింది. చాలాకాలం తరువాత రెడ్డిరాజుల కాలంలో ఈ క్షేత్రం వెలుగుచూసింది.

హరిహరులు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నారనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి. పండుగల సమయంలోను ... పర్వదినాల సమయంలోను ఇక్కడికి వచ్చే భక్తల సంఖ్య పెరుగుతూ వుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215