ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గొల్లల మామిడాడ

Wed, Jun 05, 2013, 07:00 PM
Related Image గోదావరి తీరంలో వెలసిన భద్రాచల పుణ్యక్షేత్రం భక్తుల పాలిట కొంగుబంగారమై అలరారుతోంది. ఇక్కడి రాముడు అందాల రాముడిగా కొనియాడబడుతున్నాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో మనోహరంగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం మాదిరిగానే, మరో కోదండ రాముడి క్షేత్రం మనకి 'గొల్లల మామిడాడ'లో దర్శనమిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం సమీపంలో ఈ గొల్లల మామిడాడ గ్రామం వుంది.

పూర్వం నుంచి కూడా గొల్లవారు ఎక్కువగా నివసించడం కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహించే ఈ క్షేత్రం అభివృద్ధికి ఇద్దరు సోదరులు నడుం బిగించారు. కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించమని శ్రీ రాముడు చెప్పడంతో, తమ ఆస్తిపాస్తులను ధారపోసి 1889లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. సీతారామ లక్ష్మణులు ... వారికి నమస్కరిస్తూ హనుమంతుడు గర్భాలయంలో దర్శనమిస్తారు.

విశాలమైన ఆలయ ప్రాంగణం ... పొడవైన ప్రాకారాలు ... చాలా ఎత్తుగా నిర్మించిన తూర్పు - పశ్చిమ గోపురాలు ... అందంగా తీర్చిదిద్దిన అద్దాలమేడ ... సుందరమైన శిల్ప కళతో ఈ ఆలయం కనువిందు చేస్తుంటుంది. 9 అంతస్తులు గల ఈ గోపురాలకు లోపలివైపు నుంచి మెట్లదారిని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రమణీయమైన ప్రకృతిని తిలకిస్తూ భక్తులు అనుభూతి చెందుతుంటారు.

ఆధ్యాత్మిక పరమైన పరిమళాన్ని ... ప్రకృతి పరమైన పరవశాన్ని అందించే ఈ ఆలయ నిర్మాణానికి కారకులైన వారిని మనసులో అభినందించకుండా ఉండలేరు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రంలో, స్వామివారికి జరిగే ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152