ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీ వీరాంజనేయ క్షేత్రం

Mon, Sep 23, 2013, 11:05 AM
Related Image సకల దేవతల వలన సమస్త శక్తులను పొందిన హనుమంతుడు, శ్రీరాముడి ప్రియ భక్తుడిగా వెలుగొందాడు. భక్తులు తమ దైవాన్ని ఏ విధంగా స్మరించాలో ... ఎంతగా సేవించాలో ఆచరించి చూపించాడు. హనుమంతుడిని పూజించిన వారికి దుష్టగ్రహ బాధలు ఉండవనీ, శని దోషాలు సైతం తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే వివిధ ప్రాంతాల్లో ఆయన క్షేత్రాలు అలరారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొలువుదీరిన మరో క్షేత్రం 'పంజిమ్'. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఈ క్షేత్రం 'గోవా' లో విరాజిల్లుతోంది. పూర్వం ఓ భక్తుడికి కలలో కనిపించి స్వామి ఆదేశించిన కారణంగా, ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడిందని అంటారు.

విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో చలువరాతితో చేయబడిన మూలమూర్తి చాలా చిన్నదిగా కనిపిస్తూ వుంటుంది. ఈ వేదికకు ముందుగా నల్లరాతితో మలచబడిన మరో హనుమంతుడి విగ్రహం అదే పరిమాణంలో దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామివారికి అభిషేకాలు ... ఆకుపూజలు నిర్వహిస్తుంటారు.

శనిదోష నివారణార్థం స్వామికి జిల్లేడాకులు సమర్పిస్తూ వుంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవారికి ఇక్కడి ప్రకృతి సౌందర్యం మానసికమైన ప్రశాంతతను ప్రసాదిస్తుంది. వీరాంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం కుదుటపడుతుంది. గ్రహపీడలు నివారించబడి సకల శుభాలు చేకూరతాయని అంటారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69