ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పెదకాకాని

Tue, Jun 04, 2013, 02:32 PM
Related Image శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామి వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రం ... 'పెద కాకాని'. ఒకసారి భరధ్వాజ మహర్షి హోమగుండం దగ్గరున్న హవిర్భాగములను తినడానికి వచ్చిన కాకిని చూసి జాలిపడి, తన మంత్ర శక్తితో దానికి శాప విముక్తి కలిగించాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. గుంటూరు సమీపంలోని ఈ పుణ్య క్షేత్రంలో ... ఓ భక్తుడి కోరికపై సదాశివుడు ఉమా సమేతుడై వెలసినట్టు స్థానిక కథనం.

శ్రీ కృష్ణ దేవరాయల మంత్రులలో ఒకరైన 'రెంటూరి చిట్టరుసు' ఊరు పెదకాకాని కావడం విశేషం. ఆయన ద్వారా ఇక్కడ స్వామి మహిమ గురించి తెలుసుకుని రాయలవారు వచ్చి దర్శించుకున్నారట. ఈ స్వామి అనుగ్రహం కారణంగానే రాయలవారికి సంతానం కలిగిందనీ ... అందుకే ఆయన తన కుమారుడికి 'సదాశివరాయలు' అని నామకరణం చేశారని అంటారు.

ఈ క్షేత్రంలో ఓ వైపున సుబ్రహ్మణ్య స్వామి ... మరో వైపున రాహు కేతు గ్రహ మంటపం దర్శన మిస్తుంటాయి. భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ పూజలు చేయిస్తుంటారు. ప్రాచీన వైభవాన్ని చాటుకుంటోన్న ఈ క్షేత్రంలో గణపతి నవరాత్రులు ... శరన్నవరాత్రులు ... మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ... నయనానందకరంగా నిర్వహిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236