ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సిద్ధిటెక్

Sun, Jun 02, 2013, 01:14 PM
Related Image అష్టగణపతులలో 'సిద్ధి టెక్' గణపతికి ఓ ప్రత్యేకత ... ప్రాధాన్యత వున్నాయి. తలపెట్టిన కార్యక్రమాలు వెంటనే సిద్ధించేలా ఇక్కడి వినాయకుడు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'సిద్ధి టెక్' అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. ఈ క్షేత్రం అహ్మద్ నగర్ జిల్లా - కరజత్ తాలూకాలోని భీమానది ఒడ్డున విలసిల్లుతోంది. ఇక ఇక్కడ వెలసిన ఈ క్షేత్రానికి కూడా పురాణగాధ వుంది.

పూర్వం మధుకైటభులను రాక్షసులను సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువుకు వినాయకుడు సహకరించాడనీ, అందుకు గుర్తుగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఇక్కడ స్పటికాలయాన్ని నిర్మించి అందులో గణపతిని ప్రతిష్ఠించాడని 'గణేశ పురాణం' చెబుతోంది. కాలాంతరంలో ఈ ఆలయం శిధిలం కాగా, పీష్వాలు ఈ ఆలయాన్ని పునఃనిర్మించారు. అందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇక్కడ కనిపిస్తాయి.

సుదీర్ఘ కాలంగా మనసులోని కోరికలు సిద్ధించని వారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ వుంటారు. ఆనాటి నిర్మాణాలు ... అక్కడి స్థల మహాత్మ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. 'సిద్ధి గణపతి'పై భక్తులకు అపారమైన విశ్వాసం వున్న కారణంగా, ఈ క్షేత్రానికి వారి తాకిడి ఎక్కువగానే వుంటుందని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18