ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చుక్కలమావాస్య

Fri, Jul 12, 2013, 09:13 PM
చుక్కలమావాస్య వ్రతం ... దీనినే దీపస్తంభ వ్రతమని కూడా అంటారు. ఈ వ్రతం ఎంతో విశిష్టమైనదనీ ... నిష్టగా చేసిన వారికి అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుందని సాక్షాత్తు స్కాంద పురాణమే పేర్కొంది. ఈ వ్రత మహాత్మ్యం తెలిపే కథ ఒకటి ప్రచారంలో వుంది. కథలో భాగంగానే ఈ వ్రతానికి సంబంధించిన విధి విధానాలు కూడా తెలుస్తాయి.

పూర్వం ఓ బ్రాహ్మణ దంపతులు అల్పాయుష్కుడైన తమ కుమారుడు సుశర్మను ఓ పేదింటి పిల్లకు ఇచ్చి వివాహం చేశారు. తన పేదరికం గురించి ఎప్పుడూ కూడా ఆ యువతి ఆలోచించేది కాదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా తన భారాన్ని గౌరీదేవి పైనే వేసి, ఆమె పూజలతో కాలం గడుపుతూ వుండేది. అలాంటి ఆ యువతి తనకి వైధవ్యం తప్పదని తెలిసి తనలో తానే బాధపడసాగింది.

ఇది చూసిన అమ్మవారు ఆ యువతి ఒంటరిగా వున్న సమయంలో వచ్చి ఓదార్చింది. గత జన్మలో ఆమె చుక్కలమావాస్య వ్రతం చేసి ఉద్యాపన చెప్పుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పింది. చుక్కలమావాస్య వ్రత విధానం గురించి చెప్పి, దానిని వెంటనే చేసి భర్తను కాపాడుకోమని చెప్పింది. ఇంతలో విధిరాత ప్రకారం ఆ యువతి భర్త మరణించాడు. ఆ రోజు ఆషాడ బహుళ అమావాస్య కావడంతో, అమ్మవారి మాటల పట్ల పూర్తి విశ్వాసమున్న ఆ యువతి చుక్కలమావాస్య వ్రతానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంది.

బంధుమిత్రులు ఆశ్చర్యపోయి చూస్తుండగానే ఆమె వ్రతాన్ని ఆరంభించింది. వంద సున్నపు చుక్కలు దీప స్తంభానికి పెట్టి ... వంద పోగుల పసుపు దారం మేడలో ధరించింది. పచ్చి పిండితో వంద చుక్కలు నైవేద్యంగా సమర్పించింది. అమ్మవారి అనుగ్రహం వలన ... ఆ యువతి నియమ నిష్టల కారణంగా భర్త బ్రతికాడు.

ఆ తరువాత కూడా ఆమె ఒక్కో సంవత్సరానికి వందేసి సున్నపు చుక్కలు ... పచ్చి పిండి చుక్కలు ... దారపు పోగులు పెంచుకుంటూ అయిదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించింది. తన శక్తి కొలది ఒక బంగారపు చుక్కను ... ఒక వెండి చుక్కను చేయించి బ్రాహ్మణులకు దీప స్తంభంతో సహా దానమిచ్చి ఉద్యాపన చెప్పుకుంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38