ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కపిలేశ్వర పురం

Fri, Jul 12, 2013, 08:18 PM
Related Image పుణ్య క్షేత్రాలలో ... నదీ తీరంలో వెలసిన పుణ్య క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అలా గోదావరి నదీ తీరంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు అలరారుతున్నాయి. వాటిలో 'కపిలేశ్వర పురం' ఒకటి. పూర్వం కపిలమహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వలన ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. నవగ్రహాల ప్రతికూలత కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం, నారదమహర్షి ఈ నదీ తీరంలో నవజనార్ధన ఆలయాలకు రూపకల్పన చేశాడు. కాలక్రమంలో ఈ నవజనార్ధన ఆలయాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి.

కపిలేశ్వర పురంలో కొలువుదీరిన జనార్ధన స్వామి, భక్తులపాలిట కామధేనువుగా ... కల్పతరువుగా పూజలు అందుకుంటున్నాడు. శుక్ర గ్రహ దోష నివారణకుగాను నారదుడు ఇక్కడ ఈ స్వామిని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ గ్రహ దోషం నుంచి బయటపడి స్వామివారి అనుగ్రహం పొందడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. గతంలో ఈ క్షేత్రం పై కూడా మతపరమైన దాడులు జరిగాయి. అయితే స్థల ప్రాశస్త్యం కారణంగా ... భక్తులకున్న బలమైన విశ్వాసం కారణంగా ఈ క్షేత్రం ఇప్పటికీ తన వైభవాన్ని చాటుకుంటూనే వుంది.

విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి ఇక్కడ జరిగే ఉత్సవాలు ... ఊరేగింపులు చూసితీరవలసిందే. ఇటు ప్రకృతి పరమైన ఆహ్లాదాన్ని ... అటు ఆధ్యాత్మిక పరమైన పరవశాన్ని కలిగించే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించ వలసిందే.
X

Feedback Form

Your IP address: 23.23.50.247