ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సిద్ధేశ్వరుడు

Sat, Jun 01, 2013, 04:42 PM
Related Image సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. అందుకు భిన్నంగా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తూ 'సిద్ధేశ్వరుడు'గా పూజలందుకునే ప్రదేశమే అమరాపురం. ఈ విశేషాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం అనంతపురం జిల్లాలో కొలువైవుంది. క్రీ.శ.7 వ శతాబ్దంలో నొళంబ రాజ వంశీయులైన చిత్రశేఖర - సోమశేఖర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. నొళంబ వంశస్తులు ప్రతిష్ఠించడం వలన ఇక్కడి స్వామిని నొళంబేశ్వరుడనీ ... సిద్ధాసనంలో కూర్చుని వుండటం వలన సిద్ధేశ్వరుడని పిలుస్తూ వుంటారు.

శివభక్తులైన చిత్రశేఖర - సోమశేఖర రాజులు సంతానలేమి కారణంగా దిగాలు చెందారట. తమకి వారసుడిని ఇస్తే శివాలయాన్ని నిర్మించి విగ్రహరూపంలో శివుడిని ప్రతిష్ఠ చేస్తామని మొక్కుకున్నారు. ఆ తరువాత వారి కోరిక నెరవేరడంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. శివుడు విగ్రహ రూపంలో ఆసీనుడై ఉన్నట్టుగా కనిపించే క్షేత్రం ఇదొక్కటేనని అంటూ వుంటారు. ఇక ఈ క్షేత్రంలో సిద్ధేశ్వరస్వామితో పాటు 'దొడ్డేశ్వర' ... 'విరూపాక్షేశ్వర' ... 'మల్లేశ్వర' ...' సోమేశ్వర' లింగాలు కూడా దర్శనమిస్తాయి.

ఇక శివరాత్రి పర్వదినాన ఇక్కడి మూలమూర్తి నుదుటన సూర్య కిరణాలు పడటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఈ క్షేత్రంలోని కోనేరులో స్నానం చేయడం వలన సమస్త రోగాల బారి నుంచి బయటపడవచ్చని అంటారు. కార్తీక మాసంలో జరిగే విశేష పూజలకు ... శ్రావణ మాసంలో జరిగే జాతరకు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తమ తొలిపంటలో కొంతభాగాన్ని స్వామివారికి సమర్పించిన తరువాతనే మిగతాది వారు వాడుకుంటారు. ఈ విధంగా చేయడం వలన సకలసంపదలు అభివృద్ధి చెందుతాయని వారి విశ్వాసం.
X

Feedback Form

Your IP address: 54.147.196.37