ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్య పుష్పాలు

Fri, Jul 05, 2013, 11:59 AM
Related Image లోకాలకు వెలుగును ... జీవులకు చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆయన కదలికలపైనే సమస్త జీవకోటి ఆధారపడి వుంటుంది. అందుకే రుషి గణాలు ... దేవతలు ఆ స్వామిని ప్రతినిత్యం పూజిస్తూ ... సేవిస్తూ వుంటారు. అలాంటి సూర్య భగవానుడికి దోసిటతో అర్ఘ్యం వదిలి ఓ నమస్కారం సమర్పిస్తే సంతృప్తి చెందుతాడు. ఒకవేళ ఆ స్వామిని పువ్వులతో పూజించాలనుకుంటే, ఆయనకి ఇష్టమైన పువ్వులను సమర్పించ వలసి వుంటుంది.

పొగడలు ... మందారాలు ... సంపెంగలు ... పున్నాగలు ... గన్నేరులు ... తామరలు ... జాజులు ... గులాబీలు ... నాగకేసారాలు ... మొల్లలు ... మొగలి పూలు ... మోదుగలు ... అవిసెలు ... విష్ణు తులసి ... కృష్ణ తులసి సూర్య భగవానుడుకి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి.

ఇక ముళ్ళతో కూడిన పూలు ... సువాసన లేని పూలు ... నల్ల ఉమ్మెత్త పూలు .. గురివింద పూలు సూర్యుడి పూజకు పనికి రావని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన ఈ నియమాన్ని పాటిస్తూ పూజించడం వలన సూర్యుడి అనుగ్రహాన్ని పొందవచ్చుననడంలో ఎలాంటి సందేహం లేదు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69