ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మీసాల గోపాలుడు

Wed, Jul 03, 2013, 07:53 PM
Related Image సకల చరాచర సృష్టిని నడిపించే దైవం ఎలా ఉంటుందనేది సాధారణ మానవ మాత్రులెవరూ చూసింది లేదు. దైవాలు ... రూపాలు చిత్ర పటాల్లో ... ఆలయాల్లో మాత్రమే చూసి, వాళ్లు అలానే ఉంటారని అనుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో విష్ణుమూర్తికి గాని ఆయన అవతారాలైన రామకృష్ణులకు గాని మీసాలు వుండవు అనే విషయం భక్తులకు స్పష్టంగా తెలుసు. అలాంటిది ప్రాచీన కాలంనాటి ఓ పుణ్య క్షేత్రంలో గోపాలకుడైన శ్రీ కృష్ణుడికి మీసాలు వుండటం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

అలా మీసాలతో శ్రీ కృష్ణుడు కనిపించే క్షేత్రం చెన్నై - ట్రిప్లికేన్ ప్రాంతంలో దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ శ్రీ కృష్ణుడు మీసాలతో కనిపించడం వెనుక పురాణ సంబంధమైన కథ లేకపోలేదు. పూర్వం తమిళనాడు ప్రాంతాన్ని పాలించే మహారాజు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు. ఒకసారి ఆయనకి ఆ స్వామి దర్శనమిచ్చినప్పుడు, కురుక్షేత్ర యుద్ధంలో సారధిగా వున్న పార్థుడి రూపంలో ఆయనను చూడాలని వుందని చెప్పాడట.

యుద్ధంలో శ్రీ కృష్ణుడు ఆయుధం పట్టనందువలన ... రధ సారధికి మీసాలు ఉండాలనే నియమం అప్పట్లో ఆచరణలో ఉన్నందు వలన, ఆ ప్రకారమే వేంకటేశ్వరస్వామి చేతిలో చక్రం లేకుండా మీసాలతో పార్థ సారధిగా ప్రత్యక్షమయ్యాడట. ఈ కథను అందరూ విశ్వసిస్తుంటారు ... అందువల్లనే ఇక్కడి స్వామిని 'వెంకట కృష్ణన్' అని పిలుస్తూ వుంటారు.

ఇక చారిత్రక ఆధారాలను బట్టి ఈ స్వామికి క్రీ.శ.8 వ శతాబ్దంలో ఒకటవ పల్లవ రాజు ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రధాన ఆలయం చుట్టూ అనేక ఉపాలయాలు దర్శనమిస్తాయి. విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16