ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఒక విచిత్రం

Fri, Jun 28, 2013, 04:46 PM
Related Image గ్రీస్ - నేపాలోనియా ప్రాంతమంతా కొండలు ... లోయలు కన్పిస్తాయి. చెట్లు .. చేమలు ... రాళ్లు ... రప్పలతో ఆ ప్రాంతమంతా కూడా అరణ్యాన్ని తలపిస్తుంది. అలాంటి ఆ ప్రాంతంలో కొన్ని వేల రకాల విష సర్పాలు వున్నాయి. అయితే అవన్నీ కూడా ఆగస్టు 6 నుంచి 16 వరకూ ఒక ప్రదేశానికి ప్రవాహంలా తరలివస్తాయి.

పాములు నిర్ణీత సమయంలో ఒక సమూహంగా రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ... గ్రీకుల పద్ధతి ప్రకారం ఆగస్టు 6 న ఏసుక్రీస్తు పుట్టినరోజు ... 16 న మేరీమాత పుట్టిన రోజు జరుపుకుంటారు. ఆ రోజులలో అక్కడి చర్చిలో గంట మోగిస్తారు. ఆ గంట శబ్దం వినగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేల సర్పాలు ఒక ప్రవాహంలా ఆ చర్చి దగ్గరికి వస్తాయి. ఆ పాములు ఎక్కువ సంఖ్యలో వస్తే తాము పాపాలు తక్కువ చేశామనీ ... అవి తక్కువ సంఖ్యలో వస్తే తాము పాపాలు ఎక్కువ చేశామని అక్కడి ప్రజలు విశ్వసిస్తూ వుంటారు.

ఈ విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎందరో యాత్రికులు ఆశ్చర్యపోతుంటారు. అత్యంత విష పూరితాలైన ఆ పాములు ఎవరినీ కరవక పోవడం, ఏసుక్రీస్తు - మేరీమాత పుట్టిన రోజు తరువాత ఆ ప్రాంతంలో ఎక్కడా ఒక్క పాము కూడా కనిపించక పోవడం విచిత్రమని చెప్పుకుంటారు. మహిమాన్వితమైన ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37