ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవసేన వ్రతం

Fri, Jun 28, 2013, 12:01 PM
Related Image కొంత మంది తల్లులు పురిట్లోనే తమ బిడ్డలను పోగొట్టుకుని బాధతో తల్లడిల్లిపోతుంటారు. అలాంటి వారికి 'దేవసేన'(షష్ఠమ్మ)వ్రతం ఒక వరమని చెప్పవచ్చు. సంతానాన్ని కోరుకునే వారు ప్రతినెలా శుద్ధషష్ఠి నాడు ... బహుళ షష్ఠి నాడు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని బాలబాలికలకు సమానంగా పంచిపెట్టాలి. మర్రిచెట్టు మొదట్లో గానీ, సాలగ్రామంతో పాటు గాని షష్ఠమ్మ తల్లి ప్రతిమను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించాలి. పాలు .. పెరుగు .. వెన్న .. మీగడలు నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి.

ఇక ఈ వ్రతానికి సంబంధించిన కథలోకి వెళితే ... పూర్వం ఓ రాజ దంపతులకు ఓ మగబిడ్డ జన్మించాడు. చూడటానికి ఎంతో అందంగా ... ఆరోగ్యంగా కనిపించే ఆ పిల్లవాడు చనిపోయి పుట్టాడు. ఫలితంగా ఆ దంపతులు తాము చేసిన పాపమేమిటంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దాంతో వారికి దేవసేన ( షష్ఠమ్మ) దర్శనమిచ్చింది. తన అనుగ్రహం లేకపోవడం వల్లనే వారికి అలాంటి బిడ్డ పుట్టాడని చెప్పింది. దాంతో ఆ రాజ దంపతులు తప్పని సరిగా ఆమెను పూజిస్తామని వేడుకున్నారు. దేవసేన కరుణించి ఆ బిడ్డను బతికించి అదృశ్యమైంది. అనుకున్న ప్రకారం ఆ రాజ దంపతులు ఈ వ్రతాన్ని ఆచరించి ఆమె అనుగ్రహానికి పాత్రులయ్యారు. అప్పటి నుంచి ఈ వ్రతం ప్రచారంలోకి వచ్చినట్టుగా ఈ కథ చెబుతోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254