ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అయ్యప్పస్వామి క్షేత్రం

Wed, Aug 31, 2016, 09:09 AM
Related Image ఆపదల నుంచి గట్టెక్కించే స్వామిగా అయ్యప్పస్వామిని గురించి చెబుతుంటారు. ఆయనని తలచుకున్నంత మాత్రాన్నే తోడుగా నిలిచి నడిపిస్తాడని అంటారు. అలాంటి అయ్యప్పస్వామికి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి యేటా ఆయన దీక్ష తీసుకునే భక్తులు ఎంతోమంది కనిపిస్తుంటారు.

చాలామంది భక్తులు అనునిత్యం ఆయన దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో, తమ గ్రామాల్లోనే అయ్యప్పస్వామి ఆలయాలను నిర్మించుకున్నారు. అలాంటి ఆలయాలలో ఒకటి గరిడేపల్లిలో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. కొంతమంది భక్తులు కలిసి మిగతా గ్రామస్తుల సహాయ సహకారాలతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారు.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, నయనానందకరంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికపరమైన అనుభూతి కలిగేలా ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ స్వామివారికి జరిపే అభిషేక దృశ్యం చూసితీరవలసిందే. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5