ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భగవంతుడు ఆశించేది భక్తి శ్రద్ధలే

Fri, Aug 19, 2016, 09:18 AM
Related Image అనంతమైన ఈ విశ్వంలో ఎన్నో దివ్య క్షేత్రాలు .. మరెన్నో పుణ్యతీర్థాలు వున్నాయి. ఆయా క్షేత్రాలలో కొలువైన దైవాన్ని దర్శించుకోవాలని చాలామంది భక్తులు ఆసక్తిని చూపుతుంటారు. ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా కుటుంబ సభ్యులతో కలిసి, ఆయా క్షేత్రాలను దర్శించుకుని వస్తుంటారు. అయితే ఏ క్షేత్రానికైనా హడావిడిగా వెళ్లి రాకూడదు. వెళ్లాలనుకున్న క్షేత్ర విశేషాలను ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ క్షేత్ర మహాత్మ్యం గురించిన పూర్తి విశేషాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది.

మరికొంతమంది క్షేత్ర దర్శనం చేసుకుని వెళ్లాక, ఇక ఆ క్షేత్రాన్ని గురించి మరిచిపోతుంటారు. అలా కాకుండా ఆ క్షేత్రంలో కొలువైన దైవం రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలి. ఆ క్షేత్ర వైభవాన్ని తలచుకుంటూ వుండాలి. అక్కడి భగవంతుడికి మనసులోనే నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఒక క్షేత్రానికి ఎన్ని మార్లు వెళ్లామనేదానికన్నా, అక్కడి భగవంతుడి రూపాన్ని మనసులో ఎంత గాఢంగా ముద్రించుకున్నామనేదే ప్రధానం. ఆ దైవం పట్ల ఎంతటి భక్తి శ్రద్ధలను కలిగి వున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవరి నుంచైనా భగవంతుడు ఆశించేది భక్తి శ్రద్ధలే.
X

Feedback Form

Your IP address: 54.147.212.136