ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోలమాంబ అని అందుకే పిలుస్తారు

Thu, Jul 21, 2016, 09:26 AM
Related Image విశాఖ జిల్లా పరిధిలోని పెదవాల్తేరులో గల 'పోలమాంబ' ఆలయంలో దుర్గాదేవి .. లక్ష్మీదేవి .. సరస్వతీ దేవి మూల మూర్తులు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. ఈ మూర్తులలో దుర్గాదేవి మూర్తిని 'పోలమాంబ'గా భక్తులు పిలుచుకుంటూ వుంటారు.

సాధారణంగా సముద్రంలో జాలర్లు 'వల' విసిరినప్పుడు దేవతా విగ్రహాలు ఆ వలలో పడటమనేది జానపద కథల్లో వింటూ ఉంటాము. కానీ నిజంగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం, చేపల వేటకి సముద్రంలోకి వెళ్లిన ఇక్కడి జాలరులు 'వల' విసరగా అందులో దుర్గాదేవి మూర్తి పడింది. అమ్మవారి మహిమగా భావించిన జాలరులు ఆ ప్రతిమను తీసుకువచ్చి తాత్కాలికంగా ఒక 'కరకచెట్టు' క్రింద ఉంచారు.

ఆ తరువాత భక్తుల సంకల్పంతో అమ్మవారికి ఆలయం నిర్మించబడింది. ఈ అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి వర్షాలు బాగా కురవడం .. పొలాలు కళకళలాడుతూ ఉండటం జరుగుతోంది. ఆరంభంలో కరకచెట్టు క్రింద ఉండటం వలన .. పొలాలు పచ్చగా వుంచుతున్నందు వలన ఈ అమ్మవారిని 'కరకచెట్టు పోలమాంబ'గా భక్తులు పూజిస్తుంటారు .. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.204.130.177