ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్ష్మీదేవికి అలా ప్రీతి కలుగుతుంది

Sat, Jul 09, 2016, 08:46 AM
Related Image జీవితంలో అవసరాలు తీరాలన్నా .. ఆపదల నుంచి గట్టెక్కాలన్నా ధనమనేది అవసరమవుతుంది. అలాంటి ధనం లక్ష్మీదేవి అనుగ్రహం వలన చేకూరుతుంది. లక్ష్మీదేవి చల్లని చూపు తమపై ఉండాలనే అంతా ఆ తల్లిని పూజిస్తుంటారు .. అంకితభావంతో సేవిస్తుంటారు. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించాలంటే, ఆ తల్లి ఆ ఇంట్లో కొలువై ఉండాలి. ఆమె అలా ఉండాలి అంటే ... పవిత్రత .. ప్రశాంతత తో కూడిన జీవిన విధానాన్ని కొనసాగిస్తూ, సోమరితనం లేకుండా ఆ కుటుంబసభ్యులు నడచుకోవలసి ఉంటుంది.

తెల్లవారు జామునే నిద్రలేచి ఎవరైతే పూజా మందిరంలో దీపారాధన చేస్తారో .. భగవంతుడిని ఆరాధిస్తారో ఆ ఇంట ఉండటానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఎవరైతే తమ జీవన విధానంలో పవిత్రతను పాటిస్తూ వుంటారో, అలాంటివారిని కరుణించడానికి అమ్మవారు ఆసక్తిని చూపుతుంది. ఉదయాన్నే నిద్రలేవని వారి ఇళ్లను .. బద్ధకం కారణంగా కష్టపడని వారి ఇళ్లను అమ్మవారు విడిచి పెట్టేస్తుందని ఆధాయాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ అవసరమే కనుక, ఆ తల్లికి నచ్చిన మార్గంలో ప్రయాణించడమే ఉత్తమమని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38