ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహా శివుడి మహాత్మ్యం

Wed, Jul 06, 2016, 09:38 AM
Related Image పరమశివుడు కొలువైన ఒక్కో క్షేత్రం ఆయన లీలా విశేషాలకు నిలయంగా వెలుగొందుతూ ఉంటుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా 'వాడపల్లి' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడాకి సమీపంలో శివకేశవ క్షేత్రంగా ఇది విలసిల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రంలో .. శివలింగం పైభాగంలో సొట్ట పడినట్టుగా వున్న ప్రదేశం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పొంగిపోయి బయటికి రావడం జరగదు .. అలాగని ఎంతగా తీసినా ఆ నీటి పరిమాణం తగ్గదు.

పరమశివుడు ఒక పావురాన్ని రక్షించడం కోసం, తన తల నుంచి మాంసాన్ని తీసుకోమని ఒక బోయవాడికి చెప్పడం .. అతను అలాగే చేయడం వలన శివలింగంపై ఈ సొట్ట వంటి భాగం ఏర్పడిందని అంటారు. ఈ నీరు ఎంత లోతు నుంచి వస్తుందో తెలుసుకోవడం కోసం, ఆదిశంకరాచార్యులవారు, ఒక ఉద్ధరిణికి దారం కట్టి దానిని ఆ రంద్రం నుంచి లోపలికి వదిలారట.

అలా ఎంతగా దారం వదిలినా వెళుతూనే ఉండటంతో, అది శివుడి లీలా విశేషమేనని ఆయనకి అర్థమై ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ దారం వెనక్కి తీయగా దానికి రక్తపు మరకలు అంటడం చూసిన ఆయన, స్వామి అక్కడ ప్రత్యక్షంగా వున్నాడని గ్రహించారు. ఈ వైనమంతా ఇక్కడి శిలాఫలకంపై కనిపిస్తుంది. కృష్ణానదీ తీరంలో కొలువైన ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.
X

Feedback Form

Your IP address: 54.163.94.5