ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణికంఠస్వామి దర్శనం

Thu, Jun 30, 2016, 09:16 AM
Related Image అయ్యప్పస్వామి లీలా విశేషాలు అనేకం. అందుకే భక్తులు ఆయన దీక్షను తీసుకోవడం .. శబరిమలకు వెళ్లి జ్యోతి దర్శనం చేసుకోవడం చేస్తుంటారు. ఇక ఇలా ప్రతి గ్రామం నుంచి ఆయన దర్శనం కోసం వెళ్లే భక్తులు, ఆ స్వామి భజనలు చేసుకోవడానికి .. అభిషేకాదులు జరిపించుకోవడానికి గాను ఆయన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు. సామూహికంగా ఆ స్వామిని సేవిస్తూ తరిస్తున్నారు.

అలా భక్తులంతా కలిసి నిర్మించుకున్న అయ్యప్పస్వామి ఆలయాలలో ఒకటి 'గరిడేపల్లి'లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లాలోని ఓ మండల కేంద్రంగా ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ ఊళ్లో చాలాకాలం నుంచి రామాలయం ఉంది .. ఆ తరువాత ప్రాచీనకాలం నాటి శివలింగం ఒకటి బయటపడగా, ఆ శివలింగానికి కూడా ఆలయాన్ని కట్టించారు.

అలా శివకేశవుల ఆలయాలు అలరారుతుండగా, ఇటీవలే అయ్యప్పస్వామి ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తూ ఉంటుంది. స్వామి దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అయ్యప్పస్వామి ఆరాధన అన్ని శుభాలను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38