ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పంచముఖ హనుమ పూజా ఫలితం

Sat, Jun 25, 2016, 09:08 AM
Related Image హనుమా .. దయ గనుమా .. అని అశేష భక్త జనకోటి హనుమంతుడి అనుగ్రహం కోసం ప్రార్ధిస్తుంటారు. ఆ స్వామి లీలా విశేషాలను కొనియాడుతుంటారు. హనుమంతుడిని ఎవరైతే అత్యంత భక్తివిశ్వాసాలతో కొలుస్తుంటారో, వాళ్లను ఆయన సదా రక్షిస్తూ ఉంటాడు. అలా తన భక్తులను అనుగ్రహించే కొన్ని సందర్భాల్లో ఆయన పంచముఖ హనుమ రూపాన్ని ధరించాడు.

పంచముఖ రూపంలో హనుమ, నరసింహస్వామి .. గరుత్మంతుడు .. వారాహస్వామి .. హయగ్రీవ రూపాలను ధరించి దర్శనమిస్తుంటాడు. హనుమంతుడిని పూజించడం వలన, బలపరాక్రమాలు కలుగుతాయి. విజయం సాధించేవరకూ విశ్రమించని ఆత్మస్థైర్యం కలుగుతుంది.

నరసింహస్వామిని పూజించడం వలన సంపదలు కలుగుతాయి. భూత ప్రేత పిశాచాల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. వారాహస్వామిని ఆరాధించడం వలన అనారోగ్యాలు దరిచేరకుండా పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. హయగ్రీవ రూపాన్ని పూజించడం వలన జ్ఞానం లభించడమే కాకుండా, విజయం చేకూరుతుంది. ఇలా పంచముఖ హనుమను ఆరాధించడం వలన, జ్ఞానము ... విజయము .. సంపదలు .. ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.197.142.219