ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీరంగనాథుడు అలా వెలుగు చూశాడు

Sat, Jun 11, 2016, 08:20 AM
Related Image భగవంతుడు కొలువైన ప్రదేశాలకు దాదాపుగా ఆ స్వామికి చెందిన పేర్లే వుంటాయి. ఆ పేర్లతోనే ఆ గ్రామాలు పిలవబడుతూ వుంటాయి. అలా కనిపించే క్షేత్రాలలో 'శ్రీరంగాపురం' ఒకటి. మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో గల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తుంటారు.

శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు .. మరెన్నో ఆలయాలను నిర్మించారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి క్షేత్రాలను దర్శిస్తూ వుండేవారు. అలా ఒక సారి శ్రీరంగాన్ని దర్శించిన తరువాత, రంగనాథుడి ఆలయాన్ని నిర్మించాలనే కోరిక ఆయనకి కలిగిందట. ఆ రాత్రే ఆయనకి స్వప్నంలో శ్రీమహా విష్ణువు కనిపించి, రంగనాథుడిగా తాను ఆవిర్భవించిన మూర్తి ఫలానా ప్రదేశంలో ఉందనీ, ఓ గరుడ పక్షి అక్కడికి దారి చూపుతుందని చెప్పాడట. ఆ మూర్తికి ఆలయాన్ని నిర్మించమని సెలవిచ్చాడట.

అలా ఆ మరునాడు ఒక గరుడ పక్షి దారి చూపగా వెళ్లి ఆ మూర్తిని రాయలవారు కనుగొన్నారు. అలా ఆయన ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది. ప్రాచీన కాలం నాటి ఈ క్షేత్రం భక్తుల కోరికలను నెరవేరుస్తూ, వారి కొంగుబంగారంగా విలసిల్లుతోంది. ఇక్కడ స్వామివారి మూర్తిని చూసితీరవలసిందే. ఒకసారి చూస్తే చాలు ఆ దివ్యమంగళ రూపం మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215