ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రంగనాథుడు అలా ఆవిర్భవించాడు

Tue, May 17, 2016, 08:53 AM
Related Image శ్రీమహావిష్ణువు అనేక క్షేత్రాలలో రంగనాథస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి కొలువైన ఒక్కో క్షేత్రం వెనుక ఒక విశేషం వినిపిస్తూ వుంటుంది. అది స్వామి మహిమకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా 'శ్రీరంగాపురం' దర్శనమిస్తుంది.

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం, మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగొందుతోంది. భారీ రాజగోపురం .. పొడవైన ప్రాకారాలు .. సువిశాలమైన ప్రాంగణం కలిగిన ఈ క్షేత్రంలో స్వామివారు శయన ముద్రలో దర్శనమిస్తూ వుంటాడు. తన దర్శన మాత్రం చేతనే పాపాలు నశింపజేసి పుణ్య ఫలాలను ప్రసాదిస్తూ వుంటాడు.

అలాంటి ఈ స్వామి .. వనపర్తి సంస్థానాధీశుడికి స్వప్నంలో కనిపించి తన జాడ తెలిపాడట. ఫలానా చోట నిక్షిప్తమై వున్న తన మూర్తిని వెలికితీయమని ఆదేశించాడట. గరుడ పక్షి దారి చూపుతుందనీ, దానిని అనుసరిస్తూ వెళ్లి .. అది వాలిన ప్రదేశంలో ఆ మూర్తిని ప్రతిష్ఠించమని చెప్పాడట. అలా ఆ పక్షిని అనుసరించిన ఆయన, అది ఈ ప్రదేశంలో వాలగా .. ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. స్వామివారు స్వయంగా తరలిరావడం వలన, ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు భావిస్తుంటారు. అంకితభావంతో ఆ స్వామిని సేవించి తరిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114