ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్ష్మీదేవి స్వయంగా తరలివచ్చింది

Tue, Apr 05, 2016, 09:22 PM
Related Image దైవం ఎప్పుడూ కూడా తనని అంకితభావంతో ఆరాధించే భక్తులను ఓ కంట కనిపెడుతూనే వుంటుంది. వాళ్ల కష్టనష్టాలను తొలగించి, సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. తనని అనునిత్యం స్మరించే భక్తులు తన దర్శనానికి రాలేకపోయినప్పుడు, దైవమే ఆ భక్తుల ఇంటికి తరలివెళ్లిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలాంటి పుణ్యస్థలిగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ పట్టణం సమీపంలో గల 'కల్లూరు' కనిపిస్తుంది.

పూర్వం ఈ గ్రామానికి చెందిన ఒక భక్తుడు ప్రతి ఏడాది 'కొల్హాపూర్' వెళ్లి మహాలక్ష్మీదేవిని దర్శనం చేసుకుని వచ్చేవాడట. వయసుపైబడిన కారణంగా ఆ ఏడాది ఆయన అక్కడికి వెళ్లలేక చాలా బాధపడుతున్నాడట. అతని బాధను తొలగించడం కోసం అమ్మవారు స్వప్న దర్శనం ఇవ్వడమే కాకుండా, ఆ ఇంట్లోని సానరాయిని తన మూర్తిగా మార్చి అక్కడ కొలువుదీరింది. ఇక ఆ భక్తుడి ఆనందానికి అవధులు లేవు.

అదే సమయంలో ఆ ఊళ్లోని ఒక రైతు తన పొలంలో భూమి దున్నుతుండగా వేంకటేశ్వర స్వామి మూర్తి వెలుగుచూసింది. ఈ సంఘటనను దైవ సంకల్పంగా భావించి, లక్ష్మీదేవి విగ్రహం పక్కనే వేంకటేశ్వరస్వామి మూర్తిని ప్రతిష్ఠించారు. ఈ మూర్తులను చూడగానే, అవి మహిమాన్వితమైనవనే విషయం అర్థమవుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించు కోవడం వలన కలిగే ఫలితాలు, భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తూనే వుంటాయి. అయ్యవారు .. అమ్మవారు స్వయంభువులుగా ఆవిర్భవించిన క్షేత్రం కనుక, భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ .. మహిమాన్వితమైన క్షేత్రంగా వెలుగొందుతోంది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171