ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పాదరస శివలింగ పూజా ఫలితం

Sat, Apr 02, 2016, 09:00 AM
Related Image పరమశివుడు అభిషేక ప్రియుడు .. అత్యంత భక్తిశ్రద్ధలతో అభిషేకం చేసినంత మాత్రాన్నే ఆయన మురిసిపోతాడు. పరమసంతోషంతో కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అందువల్లనే భక్తులు ఆయనకి అంకితభావంతో అభిషేకాలు జరిపిస్తుంటారు. ఒక్కో శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహించడం వలన, ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అలా పాదసర శివలింగాన్ని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయనీ, ముఖ్యంగా అనారోగ్యాలు .. దారిద్ర్య బాధలు .. అపమృత్యు దోషాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు అంటున్నాయి. అనారోగ్యాలు .. ఆర్ధికపరమైన ఇబ్బందులు జీవితాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి వస్తుంది. అవి తీర్చే మార్గం కనిపించక మరో సమస్య తయారవుతుంది.

దీర్ఘకాలికమైన వ్యాధులు పట్టి పీడిస్తుండటం వలన, ఆర్ధికపరమైన ఇబ్బందుల వలన మనిషి ఆనందాన్ని .. మనశ్శాంతిని కోల్పోతాడు. వీటి బారి నుంచి బయటపడటానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే పాదసర శివలింగాన్ని పూజించడం వలన, దీర్ఘకాలిక వ్యాధులు .. ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పబడుతోంది. అప్పులు తీరే మార్గం కనిపించి .. వాటి నుంచి బయటపడటం జరుగుతుందనీ, పరమశివుడి అనుగ్రహంతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.159.154.210