ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ కోనేటి తీర్థాన్ని స్వీకరిస్తే చాలు

Thu, Mar 24, 2016, 08:58 AM
Related Image ప్రాచీనమైన క్షేత్రాలు .. భగవంతుడి అనుగ్రహంతో అక్కడ ఆవిర్భవించిన తీర్థాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడుతుంటాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా 'శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి' క్షేత్రం కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం 'గోపాలపల్లి' గ్రామంలో గల కొండపై ఈ స్వామి కొలువై వున్నాడు. స్వామివారి పేరుమీదనే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు.

నల్గొండ జిల్లాలో గల ప్రాచీనమైన క్షేత్రాలలో ఈ వేణుగోపాల స్వామి ఆలయం ముందువరుసలో కనిపిస్తుంది. స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించడం వలన, ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనదనీ .. మరెంతో మహిమాన్వితమైనదని చెబుతుంటారు. పూర్వం ఎంతోమంది మునులు ఈ కొండపై స్వామివారిని సేవిస్తూ ఉండేవారని అంటారు.

ఇక్కడ కనిపించే 'మంత్ర బావి'ని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. స్వామివారి పాద స్పర్శతో ఇక్కడ జలం ఉబికి వచ్చి కోనేరుగా మారిందని అంటారు. ఈ కోనేరునే 'మంత్ర బావి' అని పిలుస్తుంటారు. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడేవాళ్లు ఈ కోనేటిలోని నీటిని స్వీకరిస్తుంటారు. స్వామివారి పాద తీర్థం కనుక, వెంటనే ఫలితం కనిపిస్తుందని విశ్వసిస్తుంటారు. మంత్రం వేసినట్టుగా ఫలితాన్ని చూపుతుంది కనుక, ఈ కోనేరును 'మంత్ర బావి'గా చెప్పుకుంటూ వుంటారు. రామలింగేశ్వరుడితో కలిసి వేణుగోపాలుడు పూజాభిషేకాలు అందుకునే ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.150.215