ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్ష్మీదేవి నామస్మరణ ఫలితం

Wed, Mar 16, 2016, 07:57 PM
Related Image జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ అభివృద్ధిని సాధించాలని అనుకుంటారు. అందుకు అవసరమైన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వుంటారు. ఎవరికైనా సరే అవసరాలు తీరాలన్నా .. అభివృద్ధిని సాధించాలని వున్నా అందుకు ఆర్ధికపరమైన స్థిరత్వం ఎంతో అవసరం. ఆర్ధికంగా బలంగా .. స్థిరంగా ఉన్నప్పుడే, ఏ పని చేయడానికైనా కావలిసిన ధైర్యం .. ఉత్సాహం కలుగుతుంటాయి. లేదంటే ఆశయాన్ని సాధించే అవకాశం లేక నిరాశకి లోనుకావలసి వుంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయట పడటానికి లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమవుతుంది. అందుకే అంతా ఆ తల్లిని పూజిస్తుంటారు .. భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం .. అంతా ఆమెకి ఇష్టమైన విధంగా పవిత్రమైన జీవితాన్ని గడపడానికి సిద్ధపడుతుంటారు. ప్రతి శుక్రవారం పూజా మందిరంలోని అమ్మవారిని పూజించడమే కాకుండా, అమ్మవారి ఆలయాలను దర్శిస్తుంటారు.

అయితే పూజా సమయంలో మాత్రమే కాకుండా, అనునిత్యం ఆ తల్లి నామాన్ని స్మరించడం వలన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తన నామాన్ని సదా ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, వాళ్ల వెన్నంటే తాను ఉంటానని అమ్మవారే సెలవిచ్చినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అమ్మవారి నామాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే సదా స్మరిస్తూ వుంటారో, వారి మనోభీష్టాలు నెరవేరడానికి అవసరమైన అవకాశాలను అమ్మవారు కల్పిస్తుందని చెప్పబడుతోంది. అమ్మవారి ప్రీతిని పొందితే .. ఆ తల్లి ఆ ఇంట స్థిరంగా వుండి పోతుందని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.163.173.253