ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వేంకటేశ్వరస్వామి దర్శనమే చాలు!

Fri, Mar 04, 2016, 10:08 PM
Related Image వేంకటేశ్వరస్వామి దర్శనమే కష్టాలను తొలగిస్తుంది .. సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ స్వామి ఎక్కడ కొలువైనా అక్కడ భక్త జన సందోహం కనిపిస్తూనే వుంటుంది. ఆ క్షేత్రం ఆయన మహిమలతో అలరారుతూనే వుంటుంది. అలాంటి వేంకటేశ్వరస్వామి సన్నిధి కృష్ణా జిల్లా గన్నవరం మండలం 'ఉంగుటూరు'లో దర్శనమిస్తుంది.

అనేక ఆలయాలతో 'ఉంగుటూరు' ఓ ఆధ్యాత్మిక వనంలా కనిపిస్తూ వుంటుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం .. సమీపంలో శివాలయం దర్శనమిస్తుంటాయి. శివకేశవులు కొలువైన ఈ రెండు ఆలయాలు, ఆయా విశేషమైన పర్వదినాల్లో భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఇక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయం .. అడుగుపెట్టడంతోనే మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

ఈ స్వామికి పూజాభిషేకాలు జరిపించడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. వివాహం విషయంలో ఆలస్యం అవుతున్నప్పుడు ఈ స్వామిని దర్శించడం వలన, ఆటంకాలు తొలగిపోతాయని అంటారు. అలాగే ఈ స్వామిని ఆరాధించడం వలన, ఆపదలు దరిచేరవని చెబుతారు. ఆ స్వామి దర్శనమే అనుగ్రహాన్ని అందజేస్తుందనే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118