ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇక్కడ స్వామివారికి ఇష్టమైన నైవేద్యం!

Thu, Feb 18, 2016, 09:34 PM
Related Image శ్రీనివాసుడు ఎక్కడ వుంటే అక్కడ అభయం వుంటుంది .. వైభవం వుంటుంది. అలాంటి శ్రీనివాసుడికి ఆయా సమయాల్లో వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. అలాంటి పదార్థాల కన్నా ఎక్కువగా స్వామివారు 'అన్నం - పచ్చిపులుసు'ను నైవేద్యంగా స్వీకరించే క్షేత్రం ఒకటి వుంది .. అదే 'కురుమూర్తి' క్షేత్రం. మహిమాన్వితమైన ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ' అమ్మాపూర్' సమీపంలో విలసిల్లుతోంది.

స్వయంభువుగా ఆవిర్భవించిన ఇక్కడ శ్రీనివాసుడు .. కురుమూర్తిస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ భక్తులను పలకరిస్తే చాలు .. స్వామివారి మహిమలను తమ అనుభవాలుగా చెబుతుంటారు. వాటిని బట్టి ఈ స్థల మహాత్మ్యం .. ఈ స్వామి మహిమ ఎంతటిదో తెలుస్తుంది. ఈ క్షేత్రంలో తొలిసారిగా తనని సేవించిన భక్తులనే కాదు, వారి వంశాలనే స్వామి తరింపజేశాడు.

అందుకే స్వామికి సంబంధించిన సేవల్లోను .. ఉత్సవాలలోను ఆయా వంశస్తులు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటారు. అలా నైవేద్యం విషయానికి వచ్చేసరికి, కొత్తకుండలో వండిన అన్నం - పచ్చిపులుసును మాత్రమే స్వామి ప్రీతితో స్వీకరిస్తూ వుండటం విశేషం. ఒక భక్తుడికి ఆయన ఇచ్చిన వరం కారణంగానే, ఇప్పటికీ ఆ భక్తుడి వంశస్తులు స్వామికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. భక్తితో సమర్పిస్తే స్వామి దానిని ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడనడానికి, ఇక్కడ కొనసాగుతూ వస్తోన్న పద్ధతి అద్దం పడుతుంటుంది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192