ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆపదలో ఆదుకునే రాజరాజేశ్వరుడు

Thu, Jan 21, 2016, 10:19 AM
Related Image రాజరాజేశ్వరుడు అనే నామం వినగానే వేములవాడ క్షేత్రం గుర్తుకు వస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ క్షేత్రం ప్రాచీనకాలం నుంచి వెలుగొందుతూ వుంది. పరమశివుడు రాజరాజేశ్వరీదేవి సమేతంగా రాజరాజేశ్వరుడు పేరుతో ఈ క్షేత్రంలో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఈ క్షేత్రం దేవాలయాల సముదాయంగా .. శివలింగాల సమాహారంగా కనిపిస్తుంది.

ఇది మహిమాన్వితమైన క్షేత్రమనీ, ఇక్కడి స్వామివారినీ .. అమ్మవారినీ ఇప్పటికీ దేవతలు కొలుస్తూ ఉంటారని భక్తులు భావిస్తుంటారు. దేవగురువైన బృహస్పతి ద్వారా ఈ క్షేత్రం యొక్క విశిష్టతను గురించి దేవేంద్రుడు తెలుసుకుని వచ్చి, ఇక్కడి స్వామివారిని ఆరాధించి కోరిన వరాలను పొందాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఇక త్రేతాయుగంలో అరణ్యవాస కాలంలో శ్రీరామచంద్రుడు .. ద్వాపర యుగంలో వనవాస కాలంలో పాండవులు ఈ స్వామిని సేవించి అనుగ్రహాన్ని పొందినట్టుగా స్థలపురాణం వలన తెలుస్తోంది. ఇక్కడి 'ధర్మకుండం' గురించి కూడా భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన సమస్త పాపాలు నశిస్తాయని అంటారు.

ఆపదలో వున్నవారిని ఆదుకోవడానికి స్వామి ఎంతమాత్రం ఆలస్యం చేయడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. 'రాజన్నా' అని భక్తితో .. ప్రేమతో పిలిస్తే చాలు, ఆపదలను గట్టెక్కిస్తాడని అంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే మనసులోని కోరికలు నెరవేరతాయని చెబుతారు. అందుకే ఆ స్వామిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు .. ఆయన మహిమలను కొనియాడుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52