ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీరాముడు పాదుకలను ఇచ్చిన క్షేత్రం

Tue, Dec 29, 2015, 09:32 AM
Related Image ప్రాచీనకాలం నాటి శైవ క్షేత్రాలను దర్శిస్తే .. వాటిలో ఎక్కువగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు దర్శనమిస్తుంటాయి. ఇక అలా రాముడు నడయాడిన చాలా ప్రదేశాల్లో ఆ స్వామి క్షేత్రాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. తన భక్తుల కోరిక మేరకు తాను కొలువైన క్షేత్రాలు కూడా దివ్యక్షేత్రాలుగా అలరారుతుంటాయి. అలాంటి రామ సంబంధమైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి మనకి వరంగల్ జిల్లాలోని 'జీడికల్'లో కనిపిస్తుంది.

ఈ ప్రాంతానికి 'వీరాచలం' అనే పేరు కూడా వుంది. ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి ఒక మహాముని కారణమని చెబుతుంటారు. ఒకప్పుడు వీరముని ఈ ప్రదేశంలో శ్రీరాముడిని ధ్యానిస్తూ ఉండేవాడట. ఆయన భక్తికి మెచ్చిన రాముడు ప్రత్యక్షమై తన పాదుకలను ఆయనకి ప్రసాదించాడని అంటారు. ఆ మహాముని పేరుతో ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా వెలుగొందుతుందని రాముడు అనుగ్రహించాడని చెబుతారు.

శ్రీరాముడి పాద స్పర్శ సోకిన పుణ్యస్థలిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గుండంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు. విశేషమైన రోజుల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. మనసుకు ఆహ్లాదాన్ని .. ఆధ్యాత్మికపరమైన ఆనందానుభూతులను ప్రసాదించే ఈ క్షేత్రాన్ని చూసి తీరవలసిందే.
X

Feedback Form

Your IP address: 54.204.104.71