ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముక్తిని ప్రసాదించే మల్లేశ్వరుడు

Wed, Dec 23, 2015, 09:14 AM
Related Image దేవతలు .. మహర్షులు .. మరెంతోమంది మహా భక్తులు పరమశివుడిని సేవిస్తూ తరించారు. తన భక్తుల కోరిక మేరకు ఆ సదాశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక మహిమలు చూపుతూ కోరిన వరాలను ప్రసాదిస్తూ వున్నాడు. అలాంటి ప్రాచీనమైన శైవక్షేత్రాల్లో ఒకటి బెంగుళూరులోని మల్లేశ్వరం అనే ప్రాంతంలో కనిపిస్తుంది. స్వామి కారణంగానే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని అంటారు.

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేదట. ఆ అడవిలోని ఒక గుట్టపై గౌతమ మహర్షి శివానుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై .. మహర్షి కోరిక మేరకు అక్కడే లింగ రూపాన్ని ధరించాడని స్థలపురాణం వలన తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో ఒక భక్తుడి కారణంగా స్వామివారు వెలుగు చూసినట్టుగా చెబుతారు.

అప్పటి నుంచి స్వామికి నిత్య దీప .. ధూప .. నైవేద్యాలు జరుగుతూ వస్తున్నాయి. శివుడు స్వయంగా వెలసిన క్షేత్రం కావడం వలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఆ స్వామిని దర్శిస్తూ .. సేవిస్తూ తరిస్తుంటారు. స్వామి దర్శన మాత్రం చేతనే పాపాలు నశిస్తాయనీ, సంతృప్తికరమైన జీవితం తరువాత మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152