ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రుణాలు తీర్చే నారసింహుడు

Wed, Dec 16, 2015, 09:14 AM
Related Image లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి ఖమ్మం జిల్లా కేంద్రంలో కనిపిస్తుంది. మౌద్గల్యుడు అనే మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడి గుట్టపై వెలసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. పూర్వం 'స్తంభాద్రి' పేరుతో పిలవబడిన ఈ క్షేత్రం ఆనాటి నుంచి మహిమాన్వితమైన క్షేత్రంగా అలరారుతోంది.

ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన వివాహ యోగం కలగడం .. సంతాన భాగ్యం కలగడం జరుగుతాయని అంటారు. అందుకు నిదర్శనంగా ఆ కోరిక నెరవేరిన వారు మొక్కులు చెల్లిస్తూ ఇక్కడ కనిపిస్తుంటారు. మరో విశేషమేమిటంటే .. ఈ స్వామి దర్శనం మాత్రం చేతనే రుణాలు తీరడం. అవసరానికి చేసిన అప్పులు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. వాటిని తీర్చే మార్గం లేక చాలామంది నానా అవస్థలు పడుతుంటారు. అలాంటివారు ఈ స్వామి దర్శనం చేసుకుని తమ ఇబ్బందిని చెప్పుకుంటే, ఆ అప్పు తీరే మార్గాన్ని ఆయన చూపిస్తాడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

ఇక ఈ క్షేత్రంలో గుట్ట పైభాగంలో ఏర్పడిన చీలికలో నీళ్లు ఊరుతూ వుండటం స్వామి మహిమగా భావిస్తుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోను ఇందులోని తీర్థం ఎండిపోలేదు. స్వామికి ఈ నీటితోనే అభిషేకం చేస్తుంటారు. స్వామి స్వయంగా ఈ తీర్థాన్ని సృష్టించాడని స్థల పురాణంలో కనిపిస్తుంది. ఇలా అనేక మహిమలకు నిలయంగా ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది .. కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటుంది.
X

Feedback Form

Your IP address: 54.163.173.253