ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నరక చతుర్దశి రోజున ఇలా చేయాలి!

Thu, Nov 05, 2015, 07:39 AM
Related Image ఆశ్వయుజ బహుళ చతుర్దశి .. నరక చతుర్దశిగా చెప్పబడుతోంది. నరకలోకానికి అధిపతి అయిన యమధర్మ రాజుకి ఇది ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి .. నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి. ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి .. నీటిలో గంగాదేవి ఆవేశించి ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ రోజున స్నానం చేయడానికి ముందు నీటిని తుమ్మి .. తగిరస .. ఉత్తరేణి చెట్ల కొమ్మలతో కలియబెట్టాలి. ఆ తరువాత ఆ చెట్ల కొమ్మలను తలచుట్టూ తిప్పుకుంటూ స్నానం చేయవలసి ఉంటుంది. స్నానం చేసిన తరువాత యమధర్మరాజుకి గల 14 నామాలతో ఆయనని పూజించాలి. ఈ రోజున మినుములతో తయారు చేసిన పదార్థాలతో భోజనం చేయడం మంచిదని అంటారు. ఈ రోజున సాయంత్రం ఇంటిలోనూ .. ఆలయ ప్రాంగణంలోను దీపారాధన చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.211.121.63