ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వైకుంఠ ప్రాప్తిని కలిగించే ఏకాదశి

Sat, Oct 31, 2015, 07:59 AM
Related Image శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా ఏకాదశి కనిపిస్తుంది. శ్రీమహా విష్ణువు అనుగ్రహాన్ని అనతికాలంలో కలిగించడం ఏకాదశి వ్రత ఫలితంగా చెప్పబడుతోంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత వుంది. ప్రతి ఏకాదశి ఆ స్వామి పాదాల చెంత స్థానం కల్పించేదే .. ఆయన అనుగ్రహాన్ని అందించేదే. అలాంటి ఏకాదశులలో ఆశ్వయుజ బహుళ ఏకాదశి ఒకటిగా చెప్పబడుతోంది. దీనినే 'ఇందిరా ఏకాదశి' అని అంటారు.

పూర్వం ఇంద్రసేనుడనే మహారాజు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి, తన తండ్రికి మోక్షం కలిగేలా చేశాడు. అందువల్లనే ఈ ఏకాదశికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇలా ఈ రోజున చేసే విష్ణు పూజ వలన, ఇహలోకంలోని వారికి సుఖము .. నరకలోకంలో వున్న మాతా పితరులకు వైకుఠ ప్రాప్తి కలుగుతాయని ఈ వ్రత మహాత్మ్యం చెబుతోంది. ఇంతటి విశేషమైన ఫలితాన్ని అందించే ఈ ఏకాదశి రోజున ఆ శ్రీమహా విష్ణువును సేవించే భాగ్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోకూడదు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18