ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమ్మవారి మహిమ అలాంటిది

Wed, Sep 23, 2015, 09:06 AM
Related Image అమ్మా .. అనే మాటలోని కమ్మదనం ఇక ఎక్కడా వినిపించదు .. మరెక్కడా కనిపించదు. తన భక్తులను బిడ్డల మాదిరిగా చూసుకునే ఆ తల్లి, కరుణతో కరిగిపోయి కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటుంది. అందుకే అమ్మవారి ఆలయాలు ఎప్పుడు చూసినా భక్త జన సందోహంతో కిటకిటలాడుతూ వుంటాయి.

అలాంటి అమ్మవారు తనకి ఇష్టమైన ప్రదేశంలో ఆవిర్భవించినప్పుడు, భక్తులు అక్కడి నుంచి ఆ మూర్తిని మరో అనువైన ప్రదేశానికి తరలించి, అక్కడ ప్రతిష్ఠించుకుని ఆరాధించాలని అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఆ మూర్తి అక్కడి నుంచి కదలని సంఘటనలు కనిపిస్తుంటాయి. అదే ఆ తల్లి తొలి మహిమగా భక్తులు అర్థం చేసుకుని, అక్కడే పూజాది కార్యక్రమాలు జరుపుతుంటారు.

అలా మనకి మహబూబ్ నగర్ జిల్లా .. జమ్మిచేడులోని అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. జమ్మిచేడులో వెలసిన అమ్మవారు కనుక భక్తులు 'జమ్ములమ్మ'గా కొలుస్తుంటారు. చాలాకాలం క్రితం ఈ మూర్తి వెలుగు చూసినప్పుడు, మరో అనువైన ప్రదేశానికి తరలించి .. అక్కడ ఆలయాన్ని నిర్మించాలని భక్తులు అనుకున్నారు. ఆ ఉద్దేశంతో విగ్రహాన్ని కదిలించడానికి వాళ్లు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఎంతగా తవ్వినా అమ్మవారి అడుగుభాగం మాత్రం వారికి కనిపించలేదు. అది అమ్మవారి మహిమగా భావించిన భక్తులు, ఆమెకి ఇష్టమైన ఆ ప్రదేశంలోనే వుంచి పూజించడం ప్రారంభించారు. ఆపదలో కాపాడే అమ్మగా .. కోరిన వరాలనిచ్చే తల్లిగా జమ్ములమ్మ ఆరాధించబడుతోంది. తన మహిమలను చూపుతూ వెలుగొందుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3