ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శనిదేవుడు ఇలా శాంతిస్తాడు

Fri, Jun 12, 2015, 09:07 AM
Related Image జీవితం ఆనందంగా .. హాయిగా సాగిపోవాలనే అంతా కోరుకుంటారు. కష్టాలు .. నష్టాలు ఎదురవుతాయని తెలిస్తే ఆందోళన చెందుతారు. శనిగ్రహ దోషం వలన అనేక బాధలు పడవలసి వస్తుంది కనుక, ఆయన పేరు వింటేనే భయపడిపోతుంటారు. ఇక శనిదోషం వల్లనే తాము కొన్ని ఇబ్బందులు పడుతున్నట్టు తెలియగానే, సాధ్యమైనంత తొందరగా వాటి నుంచి బయటపడటానికి తమకి తెలిసిన ప్రయత్నాలు చేస్తుంటారు.

శనిదోషం వలన కలిగే ప్రతికూల ఫలితాల నుంచి .. వాటి ప్రభావ తీవ్రత తగ్గడానికి అనేక మార్గాలు చెప్పబడుతున్నాయి. శనిదోషం బారిన పడిన వాళ్లలో వ్యసనపరులు ఉన్నట్టయితే, వాటిని మానుకోవడం ఒక మార్గంగా సూచించడం జరుగుతోంది. మద్యం తాగడం .. జూదం ఆడటం .. అవినీతికీ మోసాలకి పాల్పడటం .. అసత్యాలాడటం .. పెద్దలపట్ల అహంభావంతో ప్రవర్తించడం .. దైవకార్యాలకీ .. ధర్మకార్యాలకి దూరంగా వుండటం వలన శని దోష ప్రభావం వలన కలిగే తీవ్రత ఎక్కువగా వుంటుంది.

అందువలన ఈ రకమైన ప్రవర్తన కలిగిన వారు వెంటనే తమ తీరును మార్చుకోవడం వలన ఫలితం కనిపిస్తుంది. శనిదేవుడికి పూజాభిషేకాలు జరపడం .. సూర్యుడిని ఆరాధించడం .. ఆంజనేయస్వామిని పూజించడం వలన శనిదేవుడు శాంతిస్తాడు .. దాంతో ఈ దోష ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162