ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇక్కడ స్వామి సేదదీరతాడట!

Thu, May 14, 2015, 11:19 PM
Related Image శ్రీమన్నారాయణుడు వివిధ రూపాలతో .. నామాలతో కొండలపై కొలువుదీరుతుంటాడు. ఆ స్వామిని దర్శించుకునే భక్తులు, అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతుంటారు. అయితే భక్తులైనా .. అర్చకులైనా చీకటిపడిన తరువాత కొండదిగి వచ్చేస్తుంటారు. ఆ తరువాత ఆ కొండపై ఏంజరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల వలన, కొన్ని విశేషాలు వెలుగు చూస్తుంటాయి.

అలాంటి విశేషం ఒకటి 'అనంతాద్రి'లో వినిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో సుభద్ర .. బలభద్ర .. జగన్నాథుడు, శ్రీదేవి .. భూదేవి సమేత శ్రీనివాసుడు స్వయంభువులుగా పూజలు అందుకుంటూ వుంటారు. పూర్వం ఇక్కడి జగన్నాథుడికి భక్తులు సమర్పించిన కానుకలు ఆయన సన్నిధిలోనే భద్రపరిచేవారు.

ఆ సొమ్ముకోసం ఒక రాత్రివేళ కొంతమంది దొంగలు స్వామివారి కొండపైకి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ విహరిస్తున్న స్వామివారిని ఎవరో భక్తుడనుకుని దొంగలు దాడి చేయడానికి ప్రయత్నించి శిలలుగా మారిపోయారు. ఆ శిలలను కూడా ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. ఈ కారణంగా ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నాడనీ, రాత్రి వేళలో స్వామి సేదదీరతాడని భక్తులు విశ్వసిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో ఆయనని సేవిస్తూ తరిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63