ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్షయమైన ఫలితాలనిచ్చే ధాన్య దానం

Thu, Apr 16, 2015, 02:14 PM
Related Image సాధారణంగా ఏదైనా ఒక ముఖ్యమైన కార్యాన్ని ఆరంభించాలని అనుకున్నప్పుడు, మంచిరోజు ... మంచి ముహూర్తం చూస్తుంటారు. ఆ ముహూర్త కాలంలో ఆయా కార్యాలను ఆరంభించడం వలన , ఎలాంటి ఆటంకాలు లేకుండా అవి విజయవంతంగా పూర్తవుతాయని భావిస్తుంటారు. అయితే వారం .. వర్జ్యం చూడనవసరం లేకుండా ముఖ్యమైన కార్యాలను ఆరంభించే రోజుగా 'అక్షయ తృతీయ' చెప్పబడుతోంది. వైశాఖ శుద్ధ తదియ .. అక్షయ తృతీయగా చెప్పబడుతోంది.

ఈ రోజున ఏ పని చేసినా అది అక్షయమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున అంతా పుణ్యఫలితాలను పొందాలనీ .. ఏదో ఒక రూపంలో ధనం ఇంటికి చేరాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకి ఇష్టమైన మాసం ... అందునా 'అక్షయ తృతీయ' అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అందువలన ఈ రోజున లక్ష్మీనారాయణులను షోడశ ఉపచారాలతో పూజించవలసి వుంటుంది.

అంతేకాకుండా ఈ రోజున దానం చేయడం వలన వచ్చే పుణ్యఫలితం కూడా అక్షయంగా పెరుగుతుంది గనుక, మంచినీళ్లతో పాటు అనేక వస్తువులను దానంగా ఇస్తుంటారు. ఇక ధాన్యం విషయానికి వస్తే ఈ రోజున గోధుమలు ... శనగలు దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. దానం భక్తి శ్రద్ధలతోను .. ప్రీతితోను చేయాలి. అహంభావంతోను .. అసహనంతోను చేసే దానం వలన ఎలాంటి ఫలితం వుండదు. భగవంతుడు తనద్వారా మరొకరికి అందేలా చేస్తున్నాడనే భావనతోనే దానం చేయాలి. ఆ విధంగా చేసే దానం వలన, సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.163.94.5