ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దుర్గాదేవి ఆరాధనతో దుఃఖం నశిస్తుంది

Wed, Apr 15, 2015, 01:47 PM
Related Image దుర్గతులను తొలగించేదిగా దుర్గాదేవి చెప్పబడుతోంది. ఆ తల్లిని పూజిస్తూ వుండటం వలన దారిద్ర్యం ... దుఃఖం దూరమవుతాయి. లోకకల్యాణం కోసం ఆదిపరాశక్తి ధరించిన రూపాలలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. ఆదిపరాశక్తి పరిపూర్ణమైన శక్తి ఈ రూపంలో దర్శనమిస్తుంది. ఆ తల్లి శక్తికి ఎదురులేదు ... ఆమె అనుగ్రహానికి తిరుగులేదు.

తన బిడ్డల వంటి భక్తులను ఆదుకోవడం కోసం ఆమె అనేక ప్రదేశాల్లో కొలువుదీరింది. ఆ ప్రదేశాలన్నీ కూడా శక్తి క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. మహిమాన్వితమైన క్షేత్రాలుగా అలరారుతున్నాయి. అమ్మవారి అనుగ్రహముంటే దుష్టశక్తుల బారి నుంచి విముక్తి కలుగుతుంది. సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయి. ఆ తల్లి చల్లని ఆశీస్సులు తీసుకుని, ఆమె పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని వుంచి ఆరంభించిన పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమవుతాయి.

అందుకే దుర్గమ్మతల్లి దర్శనానికీ .. అంకితభావంతో ఆమెని సేవించడానికి మహిళా భక్తులు ఆరాటపడుతుంటారు. ఆ తల్లికి చీరసారెలు సమర్పిస్తూ వుంటారు. ఇక అమ్మవారిని పూజించడం వలన రాహు గ్రహ సంబంధమైన దోషం కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పబడుతోంది. రాహు గ్రహ సంబంధమైన దోషంతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు, అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ ఆలయ ప్రదక్షిణలు చేయడం వలన ... ఆ తల్లికి పూజాభిషేకాలు జరిపించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37