ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్షయతృతీయ రోజున లక్ష్మీ ఆరాధన

Tue, Apr 14, 2015, 01:02 PM
Related Image ఎవరైనా అందంగా కళకళలాడుతూ కనిపిస్తే లక్ష్మీకళ ఉట్టిపడుతోందని అంటూ వుంటాం. ఎవరింటికైనా వెళితే ఆ ఇల్లు పద్దతిగా ... సంప్రదాయబద్ధంగా కనిపిస్తే, అది లక్ష్మీనివాసంలా శోభాయమానంగా వుందని అనుకుంటూ వుంటాం. అంటే లక్ష్మీదేవి ఎక్కడైతే వుంటుందో అక్కడ కళ వుంటుంది ... శోభ వుంటుంది. సంపద ఉన్నదీ .. లేనిదీ ఈ కళ చెప్పేస్తూ వుంటుంది.

అలాంటి కళను పొందాలంటే ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం ప్రయత్నించాలి. అమ్మవారికి ఇష్టమైన ధర్మమార్గంలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ, పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ వుండాలి. అహంభావాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక భావాలను అలవరచుకోవాలి. ఇక ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన 'అక్షయ తృతీయ' రోజున భక్తిశ్రద్ధలతో పూజించాలి.

ఈ రోజున చేసిన పూజ .. పుణ్యం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. ధర్మబద్ధమైన మార్గంలో గడించిన సంపద అక్షయంగా పెరుగుతుందని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని అంకితభావంతో పూజించడం .. అనంతమైన విశ్వాసంతో సేవించడం .. ఆ తల్లి ఆలయాలను దర్శించి పూజాభిషేకాలు జరిపించడం మరచిపోకూడదు. దైవాన్ని విశ్వసించినవారికీ .. సేవాగుణాన్ని కలిగినవారికి ఎలాంటి లోటు రాకుండా లక్ష్మీదేవి కటాక్షిస్తూనే వుంటుంది.
X

Feedback Form

Your IP address: 54.147.212.136