ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వైశాఖ మాసంలో చేయవలసిన దానం

Wed, Apr 08, 2015, 11:04 AM
Related Image శ్రీమహావిష్ణువు స్థితికారకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. లోకంలోని సమస్థితికి ఎవరి వలన ఎలాంటి భంగం కలగకుండా చూస్తుంటాడు. ఆ స్థితికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నం జరిగినప్పుడల్లా ఆయన వివిధ అవతారాలను ... రూపాలను ధరిస్తూ వచ్చాడు. సాధు సజ్జనులను కాపాడుతూ వచ్చాడు. అందువలన ఆ నారాయణుడిని దేవతలు ... మహర్షులు ... మహాభక్తులు కీర్తిస్తూ వుంటారు.

ఆ స్వామి అనుగ్రహాన్ని అందించేవిగా కొన్ని పర్వదినాలు కనిపిస్తూ వుంటాయి. ఇక మాసమంతా ఆయన సేవాభాగ్యం వలన విశేషమైన ఫలితాలను ఇచ్చేదిగా 'వైశాఖ మాసం' కనిపిస్తుంది. చాంద్రమానం ప్రకారం ద్వితీయ మాసంగా చెప్పబడుతోన్న వైశాఖం, అనేక విశేషాల సమాహారమైన పవిత్రమాసంగా కనిపిస్తూ వుంటుంది. ఈ మాసంలో ఎక్కడ చూసినా శుభకార్యాల సందడి దర్శనమిస్తూ వుంటుంది.

ఇక శ్రీమన్నారాయణుడికి ఇది ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతూ వుండటం వలన, ఆయన కటాక్షాన్ని కోరుతూ భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. ఈ మాసంలో లభించే నదీస్నాన ఫలితం .. పూజా ఫలితం .. దానఫలితం విశేషంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన నదీస్నానం చేసి .. వైష్ణవ క్షేత్రాలను దర్శించవలసి వుంటుంది. ఆ స్వామిని అంకితభావంతో అర్చించవలసి వుంటుంది.

ఇక ఈ మాసంలో ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుంది కనుక, పాదరక్షలు .. గొడుగు .. విసనకర్రలు దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. అలాగే ఈ మాసంలో లభించే మామిడి ఫలాలను దేవాలయాలకి తీసుకువెళ్లి, అక్కడి స్వామికి నివేదన చేశాక భక్తులకు పంచిపెట్టాలి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అనుగ్రహంతో అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయనీ, సకలశుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.146.141.60