ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కోరికలను నెరవేర్చు రుద్రాక్ష !

Mon, Mar 09, 2015, 03:53 PM
Related Image విశేషమైన పర్వదినాల్లో మాత్రమే కాదు .. అనునిత్యం ఆదిదేవుడికి పూజాభిషేకాలు నిర్వహించే భక్తులు ఎంతోమంది వున్నారు. సదాశివుడిని సేవించేవారు రుద్రాక్ష ధారణ చేసినట్టయితే, ఆ పూజ వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రుద్రాక్షను ధరించడమనేది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఒక్కో రకమైన రుద్రాక్షను ధరించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది.

అందువలన మనోభీష్టాన్నిబట్టి, ఆయా రుద్రాక్షలను ఎంచుకుని తగిన మంత్రాన్ని పఠిస్తూ ఆ రుద్రాక్షను ధరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం .. ఆయుష్షు .. ఐశ్వర్యం .. విజయం .. ఇలా వివిధరకాల కోరికలను నెరవేర్చేవిగా రుద్రాక్షలు చెప్పబడుతున్నాయి. ఇక మనసులో వున్నది ఏ కోరిక అయినా అది నెరవేర్చేదిగా 'ద్విముఖి' రుద్రాక్ష స్పష్టం చేయబడుతోంది.

రెండు ముఖాలను కలిగిన ఈ రుద్రాక్ష పాలకుడు 'చంద్రుడు' కాబట్టి, దీనిని సోమవారం రోజున ధరించడం మరింత మంచిదని చెబుతారు. ఈ రుద్రాక్షను ధరించడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చెడు అలవాట్లను ... చెడు ఆలోచనలను ఈ రుద్రాక్ష దగ్గరికి రానీయదు. ఆపదల బారిన పడకుండా కాపాడుతూ వుంటుంది.

ఇక మనసులోని కోరిక ఏదైనా అది ఈ రుద్రాక్ష ప్రభావం వలన నెరవేరుతుంది. ఇక ఏ రుద్రాక్ష అయినా దానిని ధరించినవారు పవిత్రతను పాఠిస్తూ నియమనిష్టలతో వ్యవరించినప్పుడు మాత్రమే అది ఆశించిన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.
X

Feedback Form

Your IP address: 54.205.43.70